Tuesday, August 18, 2009

మిన్నునంటుతున్న సౌదాలు ఒక వైపు మనిషి ఎదుగుదలకు అదం పడుతుంటే
పాతళన్ని చుస్తున్న ఆకలి బ్రతుకులు మరో వైపు మనిషి లోని మానవత్వన్ని వెక్కిరిస్తుంటె
ఎదుగుదలకి మానవత్వన్ని తాకట్టు పెట్టాల్సిందే అంటే
మానవత్వం వున్న మనిషికి ఎదుగుదలే లేదంటే
ఎటు వైపు పోతుంది ఈ సమాజం అని మనం ప్రశ్నించుకుంటే
ఎటు కటే పోతుంది, సమాజం ముక్కలై పొతుంది అన్న చేదు నిజం గ్రహించకుండా
ఎన్ని నూట్ల కట్టలు సంపాదించినా రేపు కోట్ల మంది ఆగ్రహానికి బలి కాక తప్పదు
నేటి నిరంకుశత్వం రేపటి విప్లవానికి శంకుస్తాపం
ఇది చరిత్ర చెపుతున్న సత్యం

Sunday, August 16, 2009

పంద్రాగష్టు వచిందట దేశం గుర్తొచిందట!
నేడు వందేమాతరం పాడాతారట, రేపు అదే నోటి తో దూషించుకుంటారట
భారతమాతకి జయ్ కొడతారట మరునాడు అదే చెత్తో కొట్టుకు చస్తారట
త్రివర్ణాన్ని ఆవిష్కరిస్తారట, పేదరికానికి అదే నిష్కౄతట
ఇది స్వాతంత్రమటా! ఎన్నో ప్రాణ త్యాగాల పై నిర్మించిన కలల స్వరాజ్యమట!

పంద్రాగష్టు వచిందట దేశం గుర్తొచిందట!
సగం పైగా ప్రజలు అక్షరజ్ఞానం లేని వారేనట
వారిని ఉద్దేసించి రాష్త్రపతి ఉపన్యసిస్తరట, ప్రధాన మంత్రి ప్రసంగిస్తారట
ఆర్థిక వౄధిరేటు గురించి వారు మాట్లాడతారట
ఆకలి చావు రేటు మనం లెక్కించుకోవాలట
కరువు గురించి వారు ప్రస్తావిస్తారట, మనం అనుభవించి తెలుసుకోవల్సిందేనట
ఇధి స్వాతంత్రమటా అజ్ఞనానికి మరో పేరట

పంద్రాగష్టు వచిందట దేశం గుర్తొచిందట!
మూడొంతుల జీవితాలు దుర్భరమటా
అయినా వేడుక జరగాల్సిందేనట సంబరం చేయల్సిందేనట
చాక్లెట్లు పంచాల్సిందేనట గర్వంగా భారతీయుడని చాటాల్సిందేనట
ఇది స్వాతంత్ర్యమటా! మనకు మనం చేసుకొంటున్న మొసమటా.

Thursday, July 30, 2009

ఎప్పుడాగునో కదా

ఎన్నో ఆశలు మరెన్నో అడియాసలు..ఎప్పుడాగునో కదా ఈ శ్వాసలు
పొతే ప్రాణం అరక్షణం...ఉంటే నరకం క్షణక్షణం
ఇంతటి కఠొర నరకం లో కూడా జీవించడం మనిషి గొప్పదనం
కాని ఇది తను సౄష్టించుకున్న వలయమే అని తెలియకపోవటమే అఙనాం,ధౌర్బాగ్యం

ఎన్నో రణాలు మరెన్నో అవమానాలు....ఎప్పుడాగునో కదా ఈ జనన-మరణాలు
ఎందుకీ జననం ఖననం ....జీవితం లొ ప్రతి నిత్యం మరణం మరణం.
ఇన్నిటినీ తట్టుకొని ముందుకు సాగడం మనిషి చేస్తున్న అద్బుతం
కాని ఇన్ని దారుణాలకీ అతడే మూలం - ఇది గ్రహించక పొవటమే ఘొరం, నేరం
నిశబ్దం! అంతా నిశబ్దం!
దూరంగా వినిపిస్తున్న నక్కల అరపులు, దగ్గరగా రోదిస్తున్న మనుషుల రోదనలు
అయినా ఆ చెవులకు నిశబ్దం! అంతా నిశబ్దం!

చీకటి! అంతా చీకటి!
దేదీప్యమానంగ ప్రకాశిస్తుంది ఆ దీపం
అయినా ఆ కళ్ళకు చీకటి! అంతా చీకటి!

సౌఖ్యం! అంతా సౌఖ్యం!
ఆ మంటలు దేహాన్ని దహించి వేస్తున్నయి
అయినా ఆ మేనికి సౌఖ్యం! అంతా సౌఖ్యం!

శాంతి! అంతా శాంతి!
గుండెలు బ్రద్దలవుతున్నయి,
అయినా ఆ మనసుకి శాంతి ! అంతా శాంతి
అంతటి ప్రళయం లోనూ ఆ మనిషికి విశ్రంతి

అద్బుతం! అది ఒక అద్బుతం!
మౄత్యువు మనిషికి ఇంతటి శక్తినిస్తుందా!
అద్బుతం! అత్యద్బుతం!

ప్రశ్న! ఇదినా ప్రశ్న!
అంతటి శక్తి నన్నెప్పుడు వరిస్తుంది?
అది నా గుండెలో మెదులుతున్న ప్రశ్న! ఇది నా ప్రశ్న!